గద్వాల మార్కెట్ యార్డులో భారీగా గంజాయి పట్టివేత..!
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026
- ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం - August 31, 2026

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం.
భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటంతో.. గద్వాల పట్టణంలో గంజాయి విక్రయాలు, సరఫరాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, ప్రధాన స్థావరాలపై పోలీసులు మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో సమస్య మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంజాయి రహిత గద్వాల కోసం కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
