రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కాలే యాదయ్య
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

షాబాద్: చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను అభినందించారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఇంటి ప్రారంభోత్సవం జరగడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

