చెరకు రైతులకు టన్నుకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలి

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర చెరకు శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు 49,592 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుండగా, ఏటా 12,39,800 మెట్రిక్ టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అయితే గత మూడు సంవత్సరాలుగా స్థానిక చక్కెర కర్మాగారం మూతపడటంతో చెరకు రైతులు తమ పంటను విక్రయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

You may also like...