పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో అండ.. రూ.20 వేల ఆర్థిక సాయం.!
- స్వయం ఉపాధితో యువత ఆదర్శంగా ఎదగాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి - November 11, 2026
- పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో అండ.. రూ.20 వేల ఆర్థిక సాయం.! - November 11, 2026
- మానవత్వం చాటుకున్న ఎలిమి శెట్టి నరేష్ రూ.10 వేల ఆర్థిక సాయం.! - November 10, 2026

వెల్దండ,నవంబర్ 11: పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా కుప్పగండ్ల మాజీ సర్పంచ్ శేఖర్ తనవంతు సహాయం అందించారు.వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ కుమార్తె మేఘన వివాహం సందర్భంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి సహాయం చేయడం సంతోషంగా ఉందని, మేఘన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాలకిష్టయ్య గౌడ్, మాజీ వార్డు సభ్యులు గోరటి పారేషా, కానుగుల శేఖర్, ఎండీ జాంగీర్, తిరుపతయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా సేవాభావంతో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న మాజీ సర్పంచ్ శేఖర్‌ను గ్రామస్తులు అభినందించారు.
