దోహా ఐటీయూ (ITU) సదస్సులో భారత డిజిటల్ విప్లవాన్ని చాటిచెప్పిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

403600.jpg

దోహాలో జరుగుతున్న అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సదస్సులో 190కి పైగా దేశాల ప్రతినిధుల సమక్షంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో భారతదేశం సాధిస్తున్న విప్లవాత్మక మార్పులను ఆయన ప్రపంచ వేదికపై వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్న వేళ, భారతదేశంలోని ప్రతి పల్లెకూ ఇంటర్నెట్ చేర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 'భారత్‌నెట్' ప్రాజెక్టు కోసం సుమారు 15 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు డాక్టర్ పెమ్మసాని తెలిపారు. అంతర్జాతీయ WSIS అవార్డు పొందిన ‘సమృద్ధ గ్రామ్’ ద్వారా గ్రామీణులకు ఒకే చోట వైద్యం, వ్యవసాయం, బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న విధానాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే, ముందస్తు హెచ్చరికలతో రూ. 5,000 కోట్ల విలువైన సైబర్ మోసాలను అడ్డుకున్న భారత్ సైబర్ రక్షణ వ్యూహాలను ప్రపంచ దేశాలకు తెలియజేశారు.

You may also like...