డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి
- డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి - September 7, 2026
- ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స - September 7, 2026
- అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు… - September 7, 2026
డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి : మండల వ్యవసాయ అధికారి వై.గిరిప్రసాద్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి వై.గిరి ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని ఈదులూరు గ్రామంలో పత్తి పంటలను పరిశీలించి డిజిటల్ క్రాప్ సర్వేపై రైతులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పత్తి పంటలో బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకనేందుకు లీటర్ నీటికి 2 శాతం యూరియా ద్రావణం లేదా 19.19.19, 13.0.45 వంటి నీటిలో కలిగే ఎరువులను పిచికారి చేసుకోవాలని సూచించారు. రసం పీల్చే పరుగుల నివారణకు అధికారుల సూచనల మేరకు మాత్రమే మందులు వినియోగించుకోవాలని తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వేతో రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు సాగు చేస్తున్న పంట. విస్తీర్ణ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రభుత్వ డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. భూములను జియో ట్యాగింగ్ ద్దారా గుర్తించి రైతు భూమి వంట వివరాలను డిజిటల్ డేటాబేస్ తో అనుసంధానం చేస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్వే సిబ్బందికి రైతులు సహకరించాలన్నారు. సన్న వడ్లకు బోనస్ పొందేందుకు సెప్టెంబర్ 10 లోపు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తర్ణ అధికారులు పరుశరాములు నవీన్ కుమార్, డీసీఎస్ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.
