మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 22 : మండల పరిధిలోని దుగినవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మిట్టపల్లి మురళయ్య కు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ల చేతులమీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఉపాధ్యాయునిగా పేరు ఉన్న మురళయ్య ఎక్కడ పని చేసిన తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందుతుంటారు. ఉత్తమ రీతిలో విద్యాబోధన చేయడంతో పాటు పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంటారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా వివిధ సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తుంటారన్న గుర్తింపు సాధించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో అవార్డు సాధించడం తన బాధ్యతను మరింత పెంచినట్లు అయిందన్నారు. తనకు సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.1000355194.jpg

You may also like...