మైసమ్మ కాలనీ గణనాధుని సన్నిధిలో మహా అన్నదానం
- జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు కల్వకుర్తి అక్షర ఎంపిక - September 22, 2026
- మైసమ్మ కాలనీ గణనాధుని సన్నిధిలో మహా అన్నదానం - September 22, 2026
- జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు - September 22, 2026

కడ్తాల్, సెప్టెంబర్ 22: కడ్తాల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో వార్డు, మైసమ్మ కాలనీలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బిక్షపతి, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జాంగీర్, బాబా, మంకీ మహేష్, ముత్తి కృష్ణ, మాజీ సర్పంచ్ వేణు పంతులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
