శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 15 :నిరుపేద కుటుంబానికి చెందిన గ్రామ వర్కర్ బ్రతుకు పోరాటంలో విద్యుత్ షాక్ రూపంలో పెను విషాదం నింపింది. చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీరాములు విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తగిలి శరీరం కాలిపోయి కల్వకుర్తి మహితా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబం కన్నీటి పర్యంతమైంది.ఈ విషాద వార్త బీఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు పోలే అశోక్, సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ శ్రీరాములుకు సర్పంచ్ మరియు అశోక్ ద్వారా చికిత్స కోసం రూ.10,000 ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందించారు.అధైర్య పడొద్దు, మీకు అండగా నేనున్నా అని భరోసా ఇచ్చారు.
