122 డివిజన్ బండ్లగూడలో గణనాథుడిని దర్శించుకున్న బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ కార్తీక్ రెడ్డి.

252636.jpg

రాజేంద్రనగర్:క్రిస్మస్‌పూర్ 122 డివిజన్ బండ్లగూడ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కాలనీలో ప్రతిష్టించిన గణనాథుని పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, యువనేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మండపానికి చేరుకున్న కార్తీక్ రెడ్డికి కాలనీ వాసులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్తో పాటు స్థానిక నేతలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

You may also like...