రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గంగని హరికృష్ణ నియామకం

252701.jpg

హైదరాబాద్, సెప్టెంబర్ 15:రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో కీలక నియామకం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ గంగని హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు శ్రీ చల్లా నర్సింహా రెడ్డి అధికారిక నియామక ఉత్తర్వులను జారీ చేశారు.ఈ నియామకంపై గంగని హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. AICC అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అలాగే TPCC అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.తన నియామకానికి సహకరించిన రాజేంద్ర నగర్ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి హరికృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...