నిరుద్యోగులకు శుభవార్త – కేజీబీవీలో తెలుగు ఉపాధ్యాయ పోస్టు ఖాళీ..
- అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బీజేవైఎం నాయకులు - November 2, 2026
- నర్సుల కొరతతో వెల్దండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు - November 2, 2026
- ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా హాజరు.. ఎమ్మెల్యే కసిరెడ్డి - November 2, 2026

వెల్దండ: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తెలుగు సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి తెలిపారు. ఈ పోస్టును అతిథి అధ్యాపకురాలిగా భర్తీ చేసేందుకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎంఏ తెలుగు, బీఈడీ, టెట్ అర్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి, ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు వెల్దండ కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని ప్రిన్సిపాల్ స్రవంతి కోరారు.
