చేవెళ్లలో భగ్గుమన్న మంటలు!

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. పాత పట్వారీ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లో భవనమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కార్యాలయంలో భద్రపరిచిన పాత రికార్డులు, వివిధ వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కార్యాలయంలోని రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయా? వాటి ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపితేనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

You may also like...