కూకట్‌పల్లి నియోజకవర్గంలో 4,092 మందికి కొత్త పెన్షన్లు

కూకట్‌పల్లి: నియోజకవర్గ పరిధిలో కొత్తగా 4,092 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరయ్యాయి. సర్కిళ్ల వారీగా కూకట్‌పల్లిలో 705, మూసాపేటలో 2,179, ఓల్డ్ బోయిన్‌పల్లిలో 1,208 మందిని ఎంపిక చేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జి బండి రమేష్ తెలిపారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు

.

You may also like...