ఇందిరమ్మ ఇళ్ల విస్తీర్ణం పెంచాలి.. వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలి.!
- పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు – సర్పంచ్ వెంకటయ్య.! - November 16, 2026
- ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం! - November 16, 2026
- అర్హులకు ఆసరా పింఛన్ల పంపిణీ – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - November 16, 2026

ఆమనగల్ నవంబర్ 16 :ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి శ్లాబ్ విస్తీర్ణ పరిమితిని ప్రస్తుత 750 చదరపు అడుగుల నుంచి 950 చదరపు అడుగులకు పెంచాలని ఎస్సీ, ఎస్టీ (PCR & POA Act) అట్రాసిటీ అండ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జంతుక శంకర్ కోరారు. సోమవారం ఆమనగల్ మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. జీవో ఎంఎస్ నం.22ను సవరించి పేద, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే మండల పరిధిలోని అన్ని నీటి శుద్ధి కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి, నీటి నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పర్యవేక్షించాలని కోరారు. నిబంధనలు పాటించని కేంద్రాలపై చర్యలు తీసుకుని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
