భూ రీ-సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జి.విజయేందర్, పరిగి మండల డిప్యూటి తహశీల్ధార్

పరిగి:వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ రీ-సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని సర్వే సిబ్బందికి తెలియజేయడమైనది. చిగురాల్ పల్లి గ్రామ రెవెన్యూ శివారులో కొనసాగుతున్న భూ రీ – సర్వే పనులను నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించడమైనది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా భూ రీ- సర్వే ద్వారా ప్రతి రైతుకు సంబంధించిన భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించాలన్నారు.సర్వే జరిగే గ్రామాల్లో రైతులు ముందుగా అందించే సమాచారంతో సర్వే సిబ్బందికి సహకరించాలని రైతులకు సూచించడమైనది.ఈ కార్యక్రమంలో లైసెన్స్ డ్ సర్వేయర్ శివ, జిపిఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

You may also like...