రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం క్రీడారంగంలో ఆర్.ఆర్. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో వాలీబాల్ పోటీలతో పాటు లాంగ్ జంప్‌లో విద్యార్థులు విశేష ప్రతిభను చాటుకున్నారు.
ఈ పోటీల్లో వర్ణిక, నిహారిక, మధు ప్రసన్నలు తమ ప్రతిభతో ఉత్తమ విజయాలను సాధించి బహుమతులు కైవసం చేసుకున్నారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాల పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు టి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం అభినందనీయమని, క్రీడాకారులకు పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
అనంతరం విజేతలైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆర్.ఆర్. విద్యార్థుల విజయాలు పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచాయి.
