రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) ఫతేనగర్ డివిజన్లోని శివాలయం సమీపంలో బిహారీ సోదరుల ఆధ్వర్యంలో ఛట్ పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛట్ పూజ ప్రకృతి ఆరాధనకు, సూర్యభగవానుడిపై భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు భారతీయ సమాజానికి ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో క్రాంతి, సూరజ్ తివారి తదితరులు పాల్గొన్నారు.
