ఫతేనగర్‌లో ఘనంగా ఛట్ పూజ వేడుకలు
ఫతేనగర్ డివిజన్లోని శివాలయం సమీపంలో బిహారీ సోదరుల ఆధ్వర్యంలో ఛట్ పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛట్ పూజ ప్రకృతి ఆరాధనకు, సూర్యభగవానుడిపై భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు భారతీయ సమాజానికి ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో…
