రైతుల ఫిర్యాదుతో స్పందన.. వ్యర్థ జలాల పైపులు తొలగింపు.!
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026
వెల్దండ,నవంబర్ 15: రైతుల సమస్యలపై పడకండి వెంకటేష్ చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. వెల్దండ మండలం రాచూర్ గ్రామంలోని వింటేజ్ కాఫీ కంపెనీ నుంచి శుద్ధి చేయని వ్యర్థ జలాలను సమీపంలోని ప్రభుత్వ భూమిలోకి వదులుతున్నారని, దీంతో రైతుల బోర్ల నుంచి ఎర్రటి నీరు వస్తూ తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో గత సోమవారం వెంకటేష్ బాధిత రైతులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మార్వో కార్తీక్ కుమార్ రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిలోకి అనుమతి లేకుండా వ్యర్థ జలాలను వదలడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ తగిన చర్యలకు ఆదేశించారు. దీంతో కంపెనీ యాజమాన్యం ఏర్పాటు చేసిన పైపులను తొలగించింది.ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రైతుల సమస్యపై చేసిన పోరాటానికి కొంతమేర ఫలితం లభించిందని, రైతులు, గ్రామస్తులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
