మహిళలకు దక్కని గౌరవం! పెన్షన్ పత్రాల పంపిణీలో కుర్చీల కొరత.. నేలపైనే మహిళల నిరీక్షణ!
- మహిళలకు దక్కని గౌరవం! పెన్షన్ పత్రాల పంపిణీలో కుర్చీల కొరత.. నేలపైనే మహిళల నిరీక్షణ! - November 14, 2026
- పింఛన్ లబ్ధిదారుల ఇంట వెలుగులు.. అర్హులందరికీ ప్రభుత్వ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి.! - November 14, 2026
- పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు.. గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - November 14, 2026
కల్వకుర్తి నవంబర్ 
14 : పురుషాధిక్య సమాజంలో మహిళలకు సముచిత గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదనే విమర్శలకు కల్వకుర్తిలో జరిగిన ఓ ఘటన అద్దం పడుతోంది.శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కుర్చీలు సరిపడా ఏర్పాటు చేయకపోవడంతో పలువురు మహిళలు నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది.ఒకవైపు ప్రజాప్రతినిధులు, పురుషులకు కుర్చీలు ఏర్పాటు చేయగా.. మహిళలు మాత్రం నేలపై కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారా? మహిళల గౌరవం పట్ల ఇంతటి నిర్లక్ష్యమా? అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహిళలకు సమాన గౌరవం మాటల్లోనే కాకుండా, ఆచరణలోనూ కనిపించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
