జహీరాబాద్ చెరుకు రైతులకు టన్నుకు రూ 5000 మద్దతు మద్దతు ధరపై హామీ!

జహీరాబాద్తె లంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు త్వరలోనే ప్రభుత్వం నుంచి తీపి కబురు అందనుంది. చెరుకు మద్దతు ధరను టన్నుకు రూ. 5000/- గా నిర్ణయించాలని కోరుతూ జహీరాబాద్‌ రైతుల బృందం సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కేన్ కమిషనర్ నర్సిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం పెరుగుతున్న సాగు ఖర్చులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరుగాలం కష్టపడుతున్న చెరుకు రైతులకు మద్దతు ధర రూ. 5000/- ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని, తక్షణమే ఈ మేర ధరను ప్రకటించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.రైతుల విన్నపాలపై కేన్ కమిషనర్ నర్సిరెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. రాబోయే 3-4 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత శాఖా మంత్రులతో విస్తృతంగా చర్చించి, మద్దతు ధర పెంపుపై జహీరాబాద్ ప్రాంత రైతులకు త్వరలోనే తీపి కబురు అందజేస్తామని భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ జగన్నాథ్ రెడ్డి మరియు జహీరాబాద్ నియోజకవర్గ చెరుకు రైతులు పాల్గొన్నారు.జహీరాబాద్ చెరుకు రై
జహీరాబాద్, నవంబరు 13: తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు త్వరలోనే ప్రభుత్వం నుంచి తీపి కబురు అందనుంది. చెరుకు మద్దతు ధరను టన్నుకు రూ. 5000/- గా నిర్ణయించాలని కోరుతూ జహీరాబాద్‌ రైతుల బృందం సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కేన్ కమిషనర్ నర్సిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం పెరుగుతున్న సాగు ఖర్చులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరుగాలం కష్టపడుతున్న చెరుకు రైతులకు మద్దతు ధర రూ. 5000/- ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని, తక్షణమే ఈ మేర ధరను ప్రకటించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.రైతుల విన్నపాలపై కేన్ కమిషనర్ నర్సిరెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. రాబోయే 3-4 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత శాఖా మంత్రులతో విస్తృతంగా చర్చించి, మద్దతు ధర పెంపుపై జహీరాబాద్ ప్రాంత రైతులకు త్వరలోనే తీపి కబురు అందజేస్తామని భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ జగన్నాథ్ రెడ్డి మరియు జహీరాబాద్ నియోజకవర్గ చెరుకు రైతులు పాల్గొన్నారు.

You may also like...