మహేష్ భౌతికకాయానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు
- మహేష్ భౌతికకాయానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు - November 13, 2026
- మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు - November 13, 2026
- రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - November 12, 2026
త్రిపురారం: మండల కేంద్రానికి చెందిన పర్వతం మహేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బుధవారం బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహేష్ అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బైరాం కృష్ణ, అనుముల శ్యాంసుందర్ రెడ్డి, జంగిలి రామలింగయ్య, అవిరెండ్ల సైదులు, తాటికొండ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

