ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు బాలస్వామి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు.!
- ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు బాలస్వామి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు.! - November 13, 2026
- ఎదురుచూపులకు తెర.. 4,203 మందికి పింఛన్ పండుగ! రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో పెన్షన్ పత్రాల పంపిణీ.! - November 13, 2026
- పోతేపల్లిలో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.! - November 13, 2026

వెల్దండ,నవంబర్ 13: కర్మన్ఘాట్ పరిధిలోని హనుమాన్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు ఉప్పు బాలస్వామి, ప్రేమలత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్లోని వారి నివాసంలో బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకుని, కేక్ కట్ చేసి వివాహ వార్షికోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ వేడుకల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు, బంధువులు, మిత్రులు సత్యనారాయణ, పాండు, కేశవులు, నరసింహ, రామకృష్ణ, శ్రీనివాసులు, గణేష్, వెంకట్ రెడ్డి, ప్రియాంక, పద్మ, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. దంపతులకు శాలువాలు కప్పి, కేక్ తినిపించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
