నాబార్డ్ నిధులతో బ్రాహ్మణపల్లి పాఠశాల అభివృద్ధికి బాటలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం
- కులవివక్షకు తావులేకుండా అందరికీ ఆలయ ప్రవేశ హక్కు కల్పించాలి - November 12, 2026
- నాబార్డ్ నిధులతో బ్రాహ్మణపల్లి పాఠశాల అభివృద్ధికి బాటలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం - November 12, 2026
- మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ కుటుంబానికి సంపత్ గౌడ్ పరామర్శ - November 11, 2026
తాడ్వాయి: మండలంలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం నాబార్డ్ నిధుల నుంచి రూ.1 కోటి 8 లక్షల 4 వేల రూపాయలు మంజూరు చేయించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం గ్రామంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని, నిధుల మంజూరుతో పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సర్పంచ్ రాజా గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు బండారి సంజీవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ, రాజీవ్ కుమార్, గైని శివాజీ, కార్యదర్శి సిద్ధిరాంరెడ్డి, మల్లేష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సుధాకర్ రావు, వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, శ్రీకాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గైని రాజలింగం, గడ్డం రాజు, నరేష్, శ్యామ్ రావు, రాజేంద్ర రావు, నర్సారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

