వేముల లక్ష్మణ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి:కేజీకేఎస్ నేతలు
- వేముల లక్ష్మణ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి:కేజీకేఎస్ నేతలు - November 11, 2026
- మూఢనమ్మకంతో సవతి సోదరుడి హత్య.. కేసును ఛేదించిన నర్మెట సర్కిల్ పోలీసులు - November 3, 2026
- జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం - October 22, 2026

జనగామ: తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ మృతితో నిరాశ్రయమైన కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) జనగామ జిల్లా అధ్యక్షుడు బూడిద గోపి, కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య డిమాండ్ చేశారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలోని లక్ష్మణ్ నివాసానికి వెళ్లిన సంఘం ప్రతినిధి బృందం ఆయన భార్య స్వప్న, తల్లిదండ్రులు, పిల్లలను పరామర్శించి ఓదార్చింది.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు లక్ష్మణ్ మృతికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ, జేసీబీ, భూమి సమస్యల విషయంలో కలెక్టర్ తీసుకున్న చర్యలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆరోపించారు.అనంతరం కేజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ.. లక్ష్మణ్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కేజీకేఎస్ జిల్లా కమిటీ తరఫున బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో బండపల్లి శంకరయ్య, యాదండ్ల పరంధాములు, పోతుగంటి కృష్ణమూర్తి, బైరగోని బలరాం, పోతుల ఆంజనేయులు, బూడిద జ్యోతి, మడిపల్లి సుధాకర్, అంబాల రాజేశ్వర్, వేముల వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
