జహీరాబాద్ నుంచి టీపీసీసీ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా అమిత్ రాజ్

జహీరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అమిత్ రాజ్ (అంజి) నియమితులయ్యారు. ఈ మేరకు మానకొండూరు శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి అమిత్ రాజ్ అందిస్తున్న సేవలు, చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ రాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ పెద్దలకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ డిపార్ట్మెంట్‌ను మరింత క్రియాశీలకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎస్సీ వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని అమిత్ రాజ్ తెలిపారు.

You may also like...