సర్పంచ్ ప్రసాద్ గౌడ్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. అమృతమ్మ కళ్లలో ఆనందం..!
- పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..! - November 9, 2026
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026
- కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..! - November 9, 2026

బొల్లంపల్లి,నవంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల ఇంటిలో దీపావళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంకమ్మని కుంట గ్రామానికి చెందిన అమృతమ్మ ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించారు. నూతన గృహంలో పూజలో పాల్గొని దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు కొండంత అండగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తున్నాయని, పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. అనంతరం ఇటీవల గాయపడిన పారిశుద్ధ్య కార్మికులు కొమ్ము రమేష్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చొప్పరి రామకృష్ణ,శ్రీనివాస్ చారి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శివ నాయక్ వార్డు సభ్యులు కట్ట పద్మమ్మ,నాయకులు బైకని వెంకటయ్య, కట్ట రాములు, కట్ట జంగయ్య, శేఖర్, వెంకటేష్, యువ నాయకులు సత్తూరి శేఖర్ గౌడ్,దార్ల లింగయ్య, మొకురాల శ్రీకాంత్, ఓర్సు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
