ఎఫ్‌జీఎఫ్ గేమ్స్‌లో జనగామ టైక్వాండో విద్యార్థుల ప్రతిభ
- ఎఫ్‌జీఎఫ్ గేమ్స్‌లో జనగామ టైక్వాండో విద్యార్థుల ప్రతిభ - October 2, 2026
- జనగామలో బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ - October 1, 2026
- వడిచర్ల గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్ చెరుకు కార్తీక్ - September 29, 2026
మహబూబాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎఫ్‌జీఎఫ్ గేమ్స్‌లో జనగామ జిల్లా టైక్వాండో క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. అబ్బాస్ టైక్వాండో అండ్ బాక్సింగ్ అకాడమీకి చెందిన క్రీడాకారులు పోటీల్లో ప్రతిభను చాటారు.గోల్డ్ మెడల్స్: పంగ సుప్రియ, కందుల నందిని.సిల్వర్ మెడల్స్: గొల్ల ఉదయ్ చరణ్, బానోతు సంతోష్.బ్రాంజ్ మెడల్స్: మంగళంపల్లి లలనా శ్రీ, డప్పు హేమంత్.ఈ సందర్భంగా కోచ్ ఎం.డి. అబ్బాస్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. రాబోయే పోటీల్లోనూ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.

