రాచూర్ లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
- కొట్లలో స్వచ్చ జల ధార..ఆరు తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత - September 30, 2026
- ఎమ్మెల్యే కసిరెడ్డి హామీతో కోర్టు కేసు ఉపసంహరణ - September 30, 2026
- వెల్దండలో అక్రమ మద్యం తయారీ పై పోలీసుల సంయుక్త దాడులు - September 30, 2026
వెల్దండ సెప్టెంబర్ 30: వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఉపసర్పంచ్ గణేష్ పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్య విషయాల పట్ల మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జ్వరం జలుబు దగ్గు తదితర వచ్చినట్లయితే వెంటనే గ్రామంలోని ఆశా కార్యకర్తలు సాంప్రదించి ప్రభుత్వం నుండి వచ్చిన ఉచిత మందులు తీసుకోవాలని సూచించారు అనంతరం మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శి లక్ష్మి. అంగన్వాడి కార్యకర్త కళ్యాణి. ఆశా కార్యకర్త రాణి బాయ్. వార్డ్ మెంబర్ స్వాతి శివశంకర్, సురేష్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
