ఎంబీబీఎస్ సీట్ సాధించిన సరితకు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత

వెల్దండ: మండల కేంద్రానికి చెందిన గుద్దటి శేఖర్–అలివేల దంపతుల కుమార్తె గుద్దటి సరిత ఎంబీబీఎస్ సీటు సాధించి వైద్య విద్యలో ప్రవేశం పొందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా సరితతో పాటు ఆమె తల్లి అలివేలమ్మను శాలువాలతో సన్మానించి, ఉన్నత విద్యకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సరిత భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి వైద్యురాలిగా సేవలందించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రామ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్‌కుమార్, జోగయ్య, నాగులునాయక్, నిరంజన్, జ్యోతి నిరంజన్, అంజినాయక్, నర్సింహా, నాగయ్య, రాజు, ప్రసాద్, వెంకటయ్య, పోలె అశోక్, సునీత ఆనంద్, కుమార్, నర్సింహా, మహేష్, బర్కం గణేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.1001221392.jpg

You may also like...