వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026
నాగర్ కర్నూల్: కల్వకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
వాకిటి శ్రీహరి,జూపల్లి కృష్ణారావుల సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర ముఖ్యమైన అంశాలపై నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల అమలు, భూభారతి కార్యక్రమం పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలు,ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సమీక్షించి,ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అందేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ సమావేశంలో ఆయా జిల్లాల గౌరవ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
