SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన
- ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ధర్నా ఓటు హక్కును హరిస్తే ఊరుకునేది లేదు - September 28, 2026
- SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన - September 28, 2026
- జనగామలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ - September 28, 2026

జనగామ, సెప్టెంబర్ 28: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిలుపుతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, డీసీసీ, టీపీసీసీ నేతలు పాల్గొన్నారు.
