బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా

బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా

​కోస్గి: ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ కోస్గికి చేరుకుంది. ఈ పాదయాత్రలో ప్రముఖ జానపద గాయని ‘రేలారే’ గంగా పాల్గొని తన మద్దతు తెలిపారు.

​తీన్మార్ మల్లన్నకు సోదరి సమానురాలైన రేలారే గంగా ఈ యాత్రలో అడుగులు వేస్తూ, తన గళంతో జానపద గేయాలు పాడుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. తన ఆట పాటలతో పాదయాత్రలో సరికొత్త ఉత్సాహాన్ని నింపి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తనవంతు పాత్ర పోషించారు. బీసీలకు రాజ్యాధికారం రావాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  

 

You may also like...