బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి
- బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ - September 27, 2026
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి - September 27, 2026

నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, సుపరిచితులైన బీరం లక్ష్మారెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.లక్ష్మారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్,సి. లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
