వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వంగూర్ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంకు సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకు నారమ్మ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు జూపల్లి జంగయ్యతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, రజక సంఘం ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1001214125.jpg

You may also like...