భక్తిశ్రద్ధల మధ్య వినాయకుడి లడ్డూ వేలం రూ. 1,10,000 కు దక్కించుకున్న దాసరి ఆనంద్ యాదవ్ కుటుంబం.

280900.jpg

బండ్లగూడ జాగీర్ :వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కిస్మత్పూర్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కొలువుదీరిన గణనాథుని లడ్డూ వేలంపాట అత్యంత భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేలంపాటలో స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొని పోటీపడ్డారు.చివరికి కాలనీకి చెందిన దాసరి ఆనంద్ యాదవ్ కుటుంబ సభ్యులు అత్యధికంగా రూ. 1,10,000 (అక్షరాలా లక్షా పది వేల రూపాయలు) పాడి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. లడ్డూను దక్కించుకున్న ఆనంద్ యాదవ్ దంపతులు, కుటుంబ సభ్యులకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్వామివారి శేషవస్త్రం, గణేశుడి చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. స్వామివారి కృపతో తమ కుటుంబానికి, కాలనీ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆనంద్ యాదవ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...