భక్తితో నిమజ్జనం.. జాగ్రత్తగా గణేశుడికి వీడ్కోలు పలుకుదాం – రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్
- భక్తితో నిమజ్జనం.. జాగ్రత్తగా గణేశుడికి వీడ్కోలు పలుకుదాం – రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ - September 25, 2026
- ప్రజా పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఎంపీ మల్లు రవి - September 25, 2026
- చలో జాజాల.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక - September 25, 2026
వెల్దండ సెప్టెంబర్ 25 : వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం గణనాథుడి నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో పాటు అప్రమత్తంగా నిర్వహించాలని టీజీఎఫ్‌సీ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎవరూ లోతైన నీటిలోకి వెళ్లవద్దని, పిల్లలను నీటి వద్దకు ఒంటరిగా పంపకూడదన్నారు. భారీ విగ్రహాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి నిమజ్జనానికి రావద్దని, పోలీసు, అధికారుల సూచనలు తప్పక పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారుల సహాయం తీసుకోవాలని తెలిపారు.
