దేవరంపల్లిలో గణేష్ ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ

మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని  పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా శోభాయాత్ర  చేయాలని  సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు .

You may also like...