తాడూరు మండలంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
- తాడూరు మండలంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ - September 25, 2026
- ఈ నెల 28న అమ్రాబాద్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక - September 25, 2026
- డిండి చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ - September 25, 2026
తాడూర్, సెప్టెంబర్ 25: తాడూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ పథకం పేద ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ రామచంద్ర రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి వినోద్ కుమార్, తాడూరు సర్పంచ్ సంద మల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు యార రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిక్కొండ్ర మల్లేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
