పర్వేద లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
- శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు - September 26, 2026
- పర్వేద లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు - September 26, 2026
- పర్వేద 8వ వార్డులో అద్భుతంగా నిమర్జనం వేడుకలుకలు - September 22, 2026
పర్వేద (శంకర్ పల్లి): పర్వేద గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శంకర్ పల్లి మండల రజక సంఘ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డిలతో పాటు వార్డు సభ్యులు, రజక సంఘ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమను, ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


