చీమలదరిలో గణేష్ విసర్జన వేడుకలు
- చీమలదరిలో గణేష్ విసర్జన వేడుకలు - September 25, 2026
- ఘనంగా మోమిన్ పేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం - September 25, 2026
- మోమిన్ పేట్ పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్ నరోత్తంరెడ్డి బాధ్యతలు - September 25, 2026
మోమిన్ పేట్ మండలకేంద్రం చీమలదరి గ్రామంలో పెద్దమ్మగడ్డ గణేశ్ విసర్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి గణపతి బొప్పా మోరియా నినాదాల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి విఘ్నేశ్వరునికి వీడ్కోలు పలికారు. ఈ శోభ యాత్రలో కాషాయ రంగు రుమళ్ళు ధరించిన పిల్లలు యువత అలంకరించిన వినాయకుని విగ్రహంతో వాహనం పై ఊరేగింపుగా సాగారు. భక్తి పాటల నడుమ సాగిన ఈ యాత్రలో గ్రామస్తులు పాల్గొని , గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని ప్రార్థించారు.
