చల్లపల్లి గణేశుడు లడ్డుకి భారీ డిమాండ్ రూ. 39500 లకు సొంతం చేసుకున్న.. కృష్ణయ్య
- చల్లపల్లి గణేశుడు లడ్డుకి భారీ డిమాండ్ రూ. 39500 లకు సొంతం చేసుకున్న.. కృష్ణయ్య - September 24, 2026
- విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యం - September 24, 2026
- జూరాలకు కృష్ణమ్మ జలాలు.. రైతులకు కాంగ్రెస్ భరోసా – కాయితి విజయ్ కుమార్ రెడ్డి - September 24, 2026
వెల్దండ:మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధి చల్లపల్లిలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో పెద్ద లడ్డూను పకాడి కృష్ణయ్య రూ.39,500కు,మరో లడ్డూను కొమ్ము మనోహర్ రూ.13,500కు, బాల గణేష్ భక్త బృందం లడ్డూను ఎర్ర జంగయ్య రూ.8600,చిన్న లడ్డూను పకాడి గోవర్ధన్ రూ.7,500కు దక్కించుకున్నారు. అనంతరం లడ్డు గ్రహీతలను యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యువకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
