విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి – సర్పంచ్ రమేష్ గౌడ్
- తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు - September 24, 2026
- తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు - September 24, 2026
- అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం - September 24, 2026
వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సర్పంచ్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.
గురువారం విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న లో వోల్టేజ్ సమస్య, తరచూ విద్యుత్ అంతరాయం వల్ల ప్రజలు ఇబ్బందులు

పడుతున్నారని తెలిపారు.గ్రామానికి అదనంగా రెండు 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు, 20 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని కోరారు. గృహ అవసరాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
