పేదలకు CMRF ఒక వరం లాంటిది: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా:

1001340995.jpg

పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరం లాంటిదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తూ, వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు.

నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే బుధవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు CMRF ద్వారా అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. లబ్ధిదారులకు హార్దిక భరోసా కల్పించారు.

You may also like...