పుట్టినరోజు వేడుకల్లో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ
- యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొన్న కమిటీ సభ్యులు - September 24, 2026
- డీసీసీ అధికార ప్రతినిధి డా. నరేందర్ పవార్ - September 24, 2026
- పుట్టినరోజు వేడుకల్లో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ - September 24, 2026
జనగామ: బుస్సారి శ్రీకృతి పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు బుస్సారి శోభ, మోహన్ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలు, గుడిసెవాసులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించిన జనగామ అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొయ్యడ రవి, తుంగ సతీష్, సిద్ధిరాల చందు, బింగి నరసింహులను ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్ రాజ్ అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు, యువత పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని సూచించారు. తమకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, నిరాశ్రయులు, నిరుపేద కుటుంబాలకు ఆహారం అందిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఆకలి చావులను నివారించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు.
