లింగారెడ్డిపల్లిలో లో-వోల్టేజీకి ఫుల్ స్టాప్ – మూడో వైర్ ఏర్పాటు
- కల్వకుర్తిలో వినాయక మండపాలలో గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు - September 24, 2026
- నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ సెలెక్షన్స్ – క్రీడాకారులకు పిలుపు - September 24, 2026
- లింగారెడ్డిపల్లి లో ఇంటింటికీ రెండు మొక్కల పంపిణీ - September 24, 2026
వెల్దండ మండలం: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ సరఫరా సమస్యలను తీర్చేందుకు గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. గ్రామంలో లో-వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో, మూడవ విడత (3rd Wire) విద్యుత్ వైర్ పిట్ చేసే పనులను సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, వార్డు సభ్యులు ఆకినమోని మల్లేష్ గారు, గ్రామ నాయకులు మల్లేపాకుల శేఖర్, మల్లేపాకుల భాస్కర్, గ్రామ మల్టీ పర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా, అందరికీ నిరంతరాయంగా విద్యుత్ అందేలా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు. కొత్త వైర్ ఏర్పాటుతో వోల్టేజ్ సమస్య పూర్తిగా తొలగిపోతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
