కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు..
- కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు.. - September 24, 2026
- గణేశుడి లడ్డూ కోసం భక్తుల పోటీ.. - September 24, 2026
- ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యం - September 23, 2026
కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం
భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు..
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 23: కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని గణనాథులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఏర్పాటు చేసి గ్రామ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మేళతాళాలు, డప్పుచప్పులు, బ్యాండ్ మేళాల నడుమ యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు నిర్వహించిన కోలాటాలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. అనంతరం ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు, నిమజ్జన ప్రదేశాల వద్దకు వినాయక విగ్రహాలను తరలించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, సర్పంచులు, యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది
