సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
- నీళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు: అనిల్ కుమార్ - October 26, 2026
- దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఐ భరత్ సుమన్ - October 19, 2026
- పెద్దామడూర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - October 19, 2026

సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, శారీరక అభివృద్ధి సాధ్యమని సూపర్వైజర్ శ్రీదేవి అన్నారు. పెద్దమడూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. రోజువారీ ఆహారంలో బియ్యం, గోధుమలు, పప్పులు, గుడ్లు, పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, విటమిన్లు, మినరల్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నెయ్యి, నూనె వంటి కొవ్వు పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆశా, అంగన్వాడీ సిబ్బంది, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
