లడ్డు, కలశం దాతలకు ఘన సత్కారం

జనగామ లోని జిఎంఆర్ కాలనీలోని వినాయక మండపంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వినాయక స్వామివారి లడ్డు, కలశాన్ని సమర్పించిన దాతలను ఆలయ పూజారి శ్రీనివాస అయ్యగారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలిపారు.వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని శ్రీనివాస అయ్యగారు పేర్కొన్నారు. కాలనీవాసులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొని దాతలను అభినందించారు.

You may also like...